Venu Thottempudi: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. వేణు తొట్టెంపూడి హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత కేరెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశాడు. దమ్ము సినిమా తరువాత మాత్రం ఆయన తెర పై కనిపించలేదు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, ఇటీవల వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ఆ సినిమా అంతగా ఆడలేదు.
చాలాకాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన వేణుకి హిట్ పడలేదే అని చాలామంది ఫీలయ్యారు. వేణు, త్రివిక్రమ్ స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మంచి క్యారెక్టర్ ఉంటే చెప్పండి చేస్తానని గతంలో అడిగానని కానీ త్రివిక్రమ్ ఇవ్వలేదని చెప్పారు. మరి.. ఇప్పుడు ఇవ్వాలనిపించిందో.. లేక వేణు గుర్తొచ్చాడో కానీ… మహేష్ మూవీలో వేణుకి త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే.. వేణు కెరీర్ మలుపు తిరిగినట్టే.
Also Read : మహేష్ కోసం.. ఇద్దరు స్టార్..