Saturday, January 18, 2025
Homeసినిమానేను హీరోను అవుతానని అనుకోనేలేదు: వైష్ణవ్ తేజ్

నేను హీరోను అవుతానని అనుకోనేలేదు: వైష్ణవ్ తేజ్

వైష్ణవ్ తేజ్ హీరోగా ‘రంగ రంగ వైభవంగా‘ సినిమా రూపొందింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహించాడు. వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ నటించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో వైష్ణవ్ తేజ్ పాల్గొన్నాడు. తన కెరియర్ కి సంబంధించిన అనేక అంశాలను పంచుకున్నాడు.

“నేని హీరోను కావడానికి ముందే పెద్ద మావయ్యతోను .. చిన్న మావయ్యతోను కలిసి నటించాను. ‘జానీ’ .. ‘శంకర్ దాదా’ .. ‘అందరివాడు’ సినిమాల్లో కనిపించాను. బీఎస్సీ పూర్తి చేసిన తరువాత ఏం చేయాలా అని ఆలోచించాను. హీరోను కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు .. అవుతానని కూడా అనుకోలేదు. దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఉండేది. అందుకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడిని. నేను హీరోను అవుతానని మొదటిసారిగా అన్నది పవన్ మావయ్యనే. ఆయన నోటిద్వారానే నేను ఫస్టు టైమ్ విన్నాను.

ఇక అప్పటి నుంచి ఆ దిశగా దృష్టిపెట్టాను. ఇన్ స్టా లో నా ఫొటో చూసి బుచ్చిబాబుగారు వచ్చి కలిశారు. ‘ఉప్పెన’ సినిమా కథ చెప్పారు. ఆ తరువాత ఆ కథను సుకుమార్ గారు చిరంజీవిగారికి చెప్పారు. కథ చాలా బాగుందనీ .. ధైర్యంగా ముందుకు వెళ్లమని చిరంజీవిగారు నాతో అన్నారు. అలా ఆ సినిమా చేయడం జరిగింది. ఇక ‘రంగ రంగ వైభవంగా’ విషయానికి వస్తే, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నేను చేసిన ఫస్టు మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

Also Read : త్వరలో కెమెరా వెనక్కి వైష్ణ‌వ్ తేజ్! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్