దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఇడుపులా పాయ లోని ఘాట్ వట్ట ఆయన తనయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రార్ధనలో జగన్ పాల్గొన్నారు.
కాగా, వైఎస్ స్ఫూర్తితోనే పాలన సాగిస్తున్నామని, ఆయన చూపిన బాటలోనే తమ పయనం ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. “నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది” అంటూ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.
Also Read : నేటినుంచి వైఎస్సార్ జిల్లాలో సిఎం టూర్