మూడు రాజధానుల విషయంలో అసెంబ్లీ వేదికగా మరింత స్పష్టత ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పరిపాలనా వికేంద్రీకరణపై ముందుకే వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశాల్లోనే మరోసారి బిల్లు ప్రవేశ పెట్టాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటినుంచి మొదలు కానున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు మండలి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభల్లో తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. ఆ వెంటనే అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల అంశంపై సిఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలిసింది. అవసరమైతే మూడు రాజధానుల అంశం రెఫరెండంగానే వచ్చే ఎన్నికలకు వెళ్ళాలని జగన్ యోచిస్తున్నారట.
ఓ వైపు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి నుంచి అరసవిల్లికి మహా పాదయాత్ర జరుగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు రేపు మొదలు కానున్న సమావేశాల్లోనే దీనిపై రాష్ట్ర ప్రజలకు మరింత క్లారిటీ ఇవ్వాలని సిఎం జగన్ నిర్ణయించారు.
Also Read : 26 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: సిఎం జగన్