ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి కోలగట్ల ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఆ వెంటనే సభా నాయకుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సభలో తెలుగుదేశం పార్టీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు ఇతర సభ్యులు ఆయన్ను సభా స్థానం వద్దకు తోడ్కొని వచ్చి సీట్లో కూర్చోబెట్టారు. స్పీకర్ తమ్మినేని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది.
2004లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సిఎం జగన్ వైఎస్సార్సీపీ స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరారు. దీనితో అయన ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 2014 తర్వాత వైఎస్సార్సీపీ తరఫున మరోసారి మండలికి అయన ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి రెండోసారి ఎనికయ్యారు.
Also Read: బిజెపిలో ఉంటూ టిడిపి కోసం కోన రఘుపతి