శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో ‘రుద్రంగి’ అనే సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్ ని నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ రోజు ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్ ని టైటిల్ మోషన్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేయగా అందులో జగపతి బాబు ని భీకరంగా, జాలి-దయ లేని ‘భీమ్ రావ్ దొర’ గా పరిచయం చేసారు.
“రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ” అని జగపతి డైలాగ్ తో ముగించేలోపు ప్రేక్షకుడి వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో ‘రుద్రంగి’ చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరుల తో తెరకెక్కిస్తున్నారు.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ కి ఫస్ట్ లుక్ కి అనూహ్యమైన స్పందన రావడంతో నిర్మాతలు చిత్రాన్ని థియేటర్లలో త్వరగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
Also Read: చరణ్ చేతుల మీదుగా ‘పరంపర2’ ట్రైలర్