Saturday, September 21, 2024
HomeTrending Newsవికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది - సజ్జల

వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది – సజ్జల

రాష్ర్ట సమగ్రాభివృధ్దికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్దేశించిన వికేంద్రీకరణ అనేదే ఏకైక మంత్రం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేశారు. అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలనలో రాష్ర్టం బాగుండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ముఖ్యాంశాలు

1. వికేంద్రీకరణకు సంబంధించినంత వరకు ప్రజావేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు జరుగుతున్నాయి. మొన్న కాకినాడ, ఈరోజు రాజమండ్రిలలో జరుగుతున్నాయి.

2. అమరావతి 29 గ్రామాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటి చంద్రబాబు పెట్టిన సోకాల్డ్ క్యాపిటల్. అది ఎండమావిలా ఆచరణలోనికి రానిది. చంద్రబాబు దోపిడీమార్గంగా ఎంచుకున్నమార్గానికి భిన్నంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆలోచనలతో డీసెంట్రలైజేషన్ లో భాగంగా మూడు రాజధానులను ప్రపోజ్ చేశాం. అది శాశ్వతంగా వికేంద్రీకరణ ఉండేలా భవిష్యత్తులో వేర్పాటువాదాలు తలెత్తకుండా మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు నెరవేరేటట్లుగా ఆలోచన చేశారు.

3.దీనికి ప్రజలు మధ్దతు ఇస్తున్నారు అనేందుకు ఉదాహరణగా స్ధానిక సంస్ధల నుంచి వరుసగా జరుగుతున్న ఎన్నికలలో ఫలితాలు దానిని ప్రతిఫలిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ప్రత్యర్ధులు ఆఖరికి దింపుడు కళ్లెం ఆశలాగా ఎలాగోలా బలవంతంగా అమరావతిని రాష్ర్టం అంతటా రుద్దాలని చూస్తున్నారు.

4.టిడిపి వాళ్ళు దానిలో భాగంగా తిరుపతికి పాదయాత్ర చేశారు. ఆరోజు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఈరోజు అరసవెల్లికి పాదయాత్ర చేస్తున్నారు. గతంలో రాయలసీమకు వెళ్లి అమరావతికి మధ్దతు ఇవ్వాలని పాదయాత్ర ద్వారా ట్రైచేశారు. అలజడులు రేపడానికి ప్రయత్నించారు. ఈరోజు మీరు గమనిస్తే విశాఖపట్నంవైపుకు వెళ్ళి అదే ప్రయత్నం చేస్తున్నారు.

5.ఈ నేపధ్యంలో అమరావతి పేరుతో కొందరు కృత్రిమ స్వరాన్ని వినిపిస్తున్నారు. మరోవైపు వికేంద్రీకరణకు మధ్దతుగా తామంతా ఉన్నామని రాష్ర్టంలోని ప్రజలంతా గొంతుకలిపి నినదిస్తున్నారు. ఈ అభిప్రాయాలును ప్రతిధ్వనించే లాగా కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే కృత్మిమ స్వరం నిజమైన స్వరం అనిపించే అవకాశం ఉంది.

6. 29 గ్రామాలలో రియల్ ఎస్టేట్ వెంచర్ టేకప్ చేశారో దానిని క్యాంపెయిన్ చేస్తున్న టిడిపి,చంద్రబాబు, దోపిడీ అలవాటు పడిన ముఠా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వదిలేస్తే వారి ఆలోచనే రాష్ర్టం ఆలోచన అనుకునే అవకాశం ఉంది. మనం కూడా గట్టిగా సమన్వయంతో తిప్పికొట్టే కార్యక్రమంలో భాగంగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు జరుగుతున్నాయి.

7.సహజంగా దీనిని ఛాంపియన్ చేసే విధంగా 29 గ్రామాల అభివృధ్దే రాష్ర్ట అభివృధ్ది అన్నట్లు వారి రియల్ ఎస్టేట్ వెంచరే ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష అన్నట్లు తెలుగుదేశం పార్టీ దాని తైనాతీలు చేస్తున్నదానిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వారి పొలిటికల్ అజెండా అది.

8. మన రాజకీయ లక్ష్యం అధికారవి కేంద్రీకరణ, అదే రాష్ర్ట సమగ్రాభివృధ్ది ఏకైక మంత్రం. రాష్ర్టంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం అనే బలమైన ఆలోచన. అన్ని వర్గాల మధ్దతు ఇచ్చే సహజమైన మన ఆలోచనా విధానం ప్రజలలోకి తీసుకువెళ్ళాలంటే మనమే నడుంకట్టాలి.

9.ఇది ప్రజలందరికి అనుకూలమైంది. సామాజిక అభివృద్దికి పనికివచ్చేది. సామాజిక సృహ కలిగిన వారు. ఓవరాల్ డెవలప్ మెంట్ మీద తపన పడేవారందరూ మధ్దతు ఇచ్చే పొలిటికల్ అజెండా ఇది. ఇలాంటి ఆలోచనకు బలం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఆలోచన ఉన్నవారందర్ని చేయి చేయి కలిపించి వారిని ముందుకు పెట్టి ప్రజలలో దీనిపై ఓ చర్చ జరిగేటట్లు చేసి తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైన ఆలోచనను తిప్పికొట్టేట్లు కార్యాచరణను ఫిక్స్ చేసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశాలలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ సీనియర్ నేతలు అందరితో చర్చించి ఈ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది.

10.పాదయాత్ర పేరుతో టిడిపి చేస్తున్న దండయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ఎంటర్ అయింది. ఇక్కడ్నుంచి విశాఖ మీదుగా అరసెవెల్లి వరకు వెళ్తుంది. ఈలోపు ప్రతిచోట ఈ దండయాత్ర తప్పు. తెలుగుదేశం ఆలోచనను ప్రజలపై బలవంతంగా రుద్దడం సరికాదు. అది వివిధ వర్గాలు,ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టేది అనే వాయిస్ రెయిజ్ కావాలి. దీనిని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలి

11. వికేంద్రీకరణ అనేదే ఏకైక మంత్రం. అదేవిధంగా అందరూ,అన్ని ప్రాంతాలు బాగుండాలి అందులో భాగంగా అమరావతి ఉండాలి. ఇదే నినాదంగా ప్రజలలోకి వెళ్లాలి. ఇక్కడ ఎవరూ అమరావతికి గాని, 29 గ్రామాలకు గాని వ్యతిరేకం కాదు.

12.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అజెండాలో ఉన్న అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని. ఈ మూడు గతంలో తమిళనాడు నుంచి మనం విడిపోయినప్పుడు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారమైనా ఆ తర్వాత అన్ని ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న ఆకాంక్షల పరంగా చూసినా ఏదైతే కేంద్రీకృతమైన అబివృధ్ది హైద్రాబాద్ లో జరగడం వల్ల అసమానతలు పెరిగి విభజన తర్వాత మనం దెబ్బతిన్నాం.

13.ఒకటే నినాదం మార్మోగాలి. వికేంద్రీకరణవైపు ఏదైతే రాష్ర్టం అడుగులు వేస్తుందో దానికి పూర్తిగా మా మధ్దతు ఉంది. వికేంద్రీకరణే రాష్ర్ట అభివృధ్దికి తారకమంత్రం. వికేంద్రీకరణే అభ్యుదయానికి తొలిమెట్టు. అనే ధ్యేయంతో ముందుకు వెళ్లాలి.

Also Read : జనవరి నుంచి పెన్షన్ కానుక పెంపు : సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్