2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిసి వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కూడా సమావేశమయ్యారు.
ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని సిఎం సూచించి వారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్ పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్ జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్ శర్మ, అశుతోష్ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్ మీనా, సూరపాటి ప్రశాంత్ కుమార్.