సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. అయన వయసు 82 సంవత్సరాలు. అనారోగ్యంతో కొద్ది రోజులుగా గుర్ గావ్ వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ములాయం నేటి ఉదయం మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
1939 నవంబర్ 22న యన జన్మించారు. పార్టీలో అందరూ ఆయన్ను నేతాజీ అని గౌరవంగా పిలుచుకుంటారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం యూపీలోని మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు… అఖిలేష్ సింగ్ యాదవ్, ప్రతీక్ యాదవ్. అఖిలేష్ కూడా యూపీ సిఎం గా పని చేశారు.
సుదీర్గ రాజకీయ జీవితంలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎనిమిది సార్లు ఎన్నికైన ములాయం ఏడు సార్లు ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో బిజెపి, కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా పనిచేసిన ములాయం