పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చాలాకాలం ఎదురు చూపుల తరువాత ఇటీవలే అయోధ్యలో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విజువల్ వండర్ అని, మరోవైపు ఆశించిన స్థాయిలో లేదనే టాక్ కూడా వచ్చింది.
అంతే కాకుండా… ‘ఆదిపురుష్‘ మూవీ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ సినిమాని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో.. దీన్ని విచారించి ప్రభాస్ మరియు మేకర్స్ కు నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నోటీసులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కాదని మరో వార్త వచ్చింది. ప్రభాస్ మరియు ఆదిపురుష్ టీమ్ కు నోటీసు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కాదని.. అది నేషనల్ సినీ వర్కర్స్ యూనియన్ అని తెలుస్తోంది.
హీరో మరియు మేకర్స్ పై చర్యలు తీసుకోడానికి NCWU లీగల్ నోటీసును అందజేసిందని పేర్కొంటున్నారు. ఆది పురుష్ హీరో, నిర్మాతలు హిందూ పురాణ ఇతిహాసమైన రామాయణాన్ని ఈ విధంగా చూపించడం ఖండించదగినదని.. మొత్తం చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందని నోటీసు అందజేసిన న్యాయవాది అష్సిహ్ రాయ్ పేర్కొన్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ విధంగా ఆదిపురుష్ వివాదంలో చిక్కుకుంది. మరి.. ఈ వివాదాల నుంచి ఎలా బయటపడుతుందో..? బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.
Also Read :