హైదరాబాద్ నగరంలో జరుగుతున్న చట్ పూజా ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరై పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్బంగా ఉత్తరాది వారు నగరంలో అత్యంత ఘనంగా చట్ పూజ నిర్వహిస్తారు. సంజీవయ్య పార్క్ సమీపంలోని గణేష్ నిమజ్జనం కొలనులో నిర్వహించిన చట్ పూజా ఉత్సవాలకు సి.ఎస్ సోమేశ్ కుమార్ తోసహా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, ఆధార్ సిన్హా, ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఏసీబీ అడిషనల్ డీజీ అంజనీ కుమార్ లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్ లో ఉండే బీహార్, ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, అస్సామ్, నేపాలీలు ప్రతీ ఏటా కార్తీక మాసంలో ఘనంగా చట్ పూజ నిర్వహిస్తారు. చట్ పూజ వేడుకలకు గాను నగరంలో దాదాపు 60 ప్రాంతాల్లో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. నగరంలోని చెరువులు, గణేష్ నిమజ్జన పాండ్స్ వద్ద ప్రత్యేకంగా చట్ పూజ ల నిర్వహణకు గాను లైటింగ్, టెంట్స్,షామియానా, టాయిలెట్ల సౌకర్యాలను కల్పించారు.