Sunday, November 24, 2024
HomeTrending Newsకనికరించని కెసిఆర్.. ప్రారంభానికి నోచుకోని కలెక్టరేట్

కనికరించని కెసిఆర్.. ప్రారంభానికి నోచుకోని కలెక్టరేట్

2017లో నిర్మాణం ప్రారంభమైన జగిత్యాల కలెక్టరేట్ 2021 ప్రారంభంలో ఓపెనింగ్ కు సిద్ధమైంది. పనులు పూర్తి అయి రెండేళ్ళ గడుస్తున్నా ప్రారంభం కాకపోవడంతో భవనం పూర్తిగా నిరుపయోగంగా మారింది. దీంతో కలెక్టరేట్ పూర్తిగా పాత భవనంలా మారిపోతోంది. భవనంలో ఫర్నీచర్, విద్యుత్ పరికరాలు, ఇతరత్రా విలువైన వస్తువులు దుమ్ము ధూళితో నిండిపోయాయి. ఇలానె కొనసాగితే లక్షలు విలువచేసే ఫర్నీచర్ మూలకు పడే అవకాశం ఉందని ఆఫీసర్లు వాపోతున్నారు. ఆఫీసు శుభ్రపరిచేందుకు ప్రతి నెల రెండు లక్షల వరకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, ప్రస్తుతం జిల్లాలో ఒక్కో ప్రభుత్వ ఆఫీసు ఒక్కో దగ్గర ఉండడంతో జిల్లాకు వచ్చే ప్రజలు ఏ కార్యాలయం ఎక్కడుందో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు.

జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తారని ఇప్పటికి మాడుసార్లు ఏర్పాట్లు చేయటం అర్ధాంతరంగా వాయిదాపడటం జరిగింది. గత కొన్ని రోజులుగా జగిత్యాల కలెక్టరేట్, వైద్య కళాశాల రెండు ఒకేసారి ప్రారంభిస్తారని ప్రచారం జరిగినా అది కూడా ఉహాగానంగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. వైద్య కళాశాలలో అడ్మీషన్లు పుర్తికావచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలు ఒకేసారి ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మంత్రి ప్రకటనకు అనుగుణంగా అధికారులు ఈ నెల 15వ తేదిన అన్నింటితో పాటు జగిత్యాల వైద్య కళాశాల కూడా ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభంపై మాత్రం స్పష్టత రావటం లేదు. రాజకీయ అవసరాలు, ఎత్తుగడలకు అనుగుణంగా సిఎం ప్రారంభోత్సవాలు చేపడుతున్నారని…ప్రజా అవసరాలు, సంక్షేమం పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల కలెక్టరేట్ వెంటనే ప్రారంభించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్