Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌, త్రివిక్రమ్ మూవీ మరింత ఆలస్యం?

మహేష్‌, త్రివిక్రమ్ మూవీ మరింత ఆలస్యం?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే  ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే.. మహేష్‌ బాబుకు కథ సరిగా నచ్చలేదని.. మార్చమని చెప్పడంతో ఈ సినిమా ఆగింది.

ఆ తర్వాత మహేష్ బాబు తల్లి మరణంతో షూట్ మరింత ఆలస్యమైంది. పైగా కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరక, తొలి షెడ్యూల్ తర్వాత తర్జనభర్జనలు జరిగి ఈ సినిమాకు బ్రేక్ పడింది. చివరికి కథలో మార్పులు చేర్పులు జరిగి అంతా ఓకే అనుకుని డిసెంబరు తొలి వారంలో చిత్రీకరణ మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా వేగం పెంచారు. ఆర్టిస్టుల డేట్లు సంపాదించి మహేష్ 28 టీమ్ షెడ్యూళ్లు ప్లాన్ చేసుకుంటోంది. అయితే… ఇప్పుడు మహేష్ తండ్రి కృష్ణ మరణించారు.

ఇది మహేష్ జీవితంలో అతి పెద్ద విషాదం అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ ఏడాది అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరల మరణంతో మహేష్ తీవ్రమైన బాధలో ఉన్నాడు. ఇంతలోనే తండ్రి మరణించడం ఆయన్ని కుంగుబాటుకు గురి చేసేదే అనడంలో సందేహం లేదు. ఈ బాధ నుంచి మహేష్ కోలుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది. అందుకే చిత్ర బృందం ఈ సినిమాను కొన్ని నెలల పాటు పక్కన పెట్టక తప్పదని తెలుస్తోంది. వచ్చే వేసవికి అనుకున్న సినిమా.. దసరాకు వాయిదా పడొచ్చని టాక్.

Also Read : ఒకే సంవత్సరం మూడు విషాదాలు.. బాధలో మహేష్‌ బాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్