సెలబ్రిటీపార్టీ నేత పవన్‌ను చూస్తుంటే రాజకీయాలపై విరక్తి కలుగుతుందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్‌కి సబ్జెక్ట్ లేదని అసలు ఆ పార్టీకి ఓ విధానం లేదని దుయ్యబట్టారు. “ఇవాళ గణతంత్ర దినోత్సవం. ఇవాళ ఎవరు ఏం మాట్లాడినా హుందాగా, సంప్రదాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉండాలి… విలువలు, సంప్రదాయం తెలిసిన వారెవరైనా అదే విధంగా మాట్లాడతారు కానీ.. ఈరోజు ఒక సెలబ్రిటీ పార్టీ నాయకుడు.. పవన్‌కళ్యాణ్ మాట్లాడినట్లు ఏ ఒక్కరూ మాట్లాడరు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాదాపు 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి, కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ ఆ సెలబ్రిటీ పార్టీ నాయకుడు పొడిచేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, చెప్పు తీసుకుని కొడతాం, తాట తీస్తాం, తోలు వలుస్తాం..వంటి భాషను ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. కేఏ పాల్‌కు, పవన్‌కి తేడా లేదన్నారు.
పవన్ దమ్ముంటే ఆపమంటున్నాడు.. “నిన్నెవడు ఆపుతాడు, ఎవడు అడ్డుకుంటాడు నువ్వు ఆవేశపడితే ఎవరు బెదురుతారు” అంటూ పవన్ ను సూటిగా ప్రశ్నించారు. “ప్రత్యేకమైన రోజుల్లో ఏమైనా మాట్లాడే ముందు ఒక విధానం ఉండాలి. ఊగిపోయి, ఆవేశపడిపోయి మాట్లాడితే నీ పిచ్చి కుర్రాళ్లు కేరింతలు కొడతారేమో గానీ.. రాజకీయాల్లో ఇది పారదు. నీ స్నేహితులు పెద్ద పెద్ద రచయితలున్నారు కదా.. కనీసం, ఈరోజు ప్రత్యేకత గురించి ఏం మాట్లాడాలో రాసివ్వమంటే రాసిచ్చేవాళ్లు కదా.. ఇలా సన్నాసి మాటలు మాట్లాడటం ఎందుకు..? రిపబ్లిక్ డే నాడు ఇన్ని బూతులు మాట్లాడినందుకు లెంపలేసుకుంటే మంచిది” అంటూ హెచ్చరించారు.