Saturday, September 21, 2024
HomeTrending NewsDharani: కేంద్ర మంత్రి గ్రామంలో వెయ్యి కోట్ల కుంభకోణం - రేవంత్ రెడ్డి

Dharani: కేంద్ర మంత్రి గ్రామంలో వెయ్యి కోట్ల కుంభకోణం – రేవంత్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లోని భూదాన్ భూముల్లో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు రూ. వేయి కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తిమ్మూపూర్ గ్రామంలో 146 ఎకరాల నిషేధిత భూమి విక్రయించారన్నారు. ఈ భూ కుంభకోణం వెనుక కేటీఆర్, బీఆర్ఎస్ నేతల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ భూమిని విక్రయించొద్దని ఆదేశాలున్నా కూడ భూ విక్రయం ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిషేధిత భూముల క్రయ విక్రయాలు జరిపిన కలెక్టర్, ఎమ్మార్వో , సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్వగ్రామంలోని భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? కలెక్టర్ పై డీఓపీటీ, విజిలెన్స్ కమీషన్ కు కిషన్ రెడ్డి ఎందకు ఫిర్యాదు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్‌లో రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భూదాన్ భూములన్నీ అసైన్డ్‌ భూములే. ఇదే అంశంపై కిషన్ రెడ్డి ఎమ్మేల్యేగా ఉన్నప్పుడు 2008లో భూదాన్ భూములపై అప్పటి కలెక్టర్ కి లేఖ రాశారు. నిషేధిత భూములన్నీ ధరణి సహాయంతో కేసీఆర్ అనుచరులకు వెళ్లాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ధరణిలో సమస్యల కారణంగా రంగారెడ్డి, మేడ్చల్, సీసీఎల్ఏ ముందు వేలాది మందు రైతులు పడిగాపులు కాస్తున్నారు అని రేవంత్ అన్నారు. 30 శాతం కమీషన్ ఇస్తే తప్ప ధరణి నిషేధిత జాబితాలోని భూములను క్లియర్ చేయని పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి రద్దు చేసి ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీ తెస్తామంటే కేసీఆర్ కి ఏడుపు ఎందుకు? అని ప్రశ్నించారు. టెక్నాలజీ సహాయంతో ప్రజలకు ఉపయోగపడే నూతన విధానం తీసుకువస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తుందని, ధరణి రద్దు చేస్తే రైతు బందు, రైతు భీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలని కన్ఫ్యుజ్ చేస్తున్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని భూ డేటాను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) నిర్వహిస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను ప్రభుత్వం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ఎఫ్ఎస్) అనే సాఫ్ట్‌ ‌వేర్ సంస్థకు అప్పగించింది. వివిధ ప్రభుత్వ రంగ వెబ్సైట్స్‌ ‌ను మెయింటేన్ చేస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ సంస్థలు ఉండగా ఐఎల్ఎఫ్ఎస్ సంస్థకు కట్టబెట్టింది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ బ్యాంకులకు సుమారు వేల కోట్లు ఎగ్గొట్టిందనే ఆరోపణలు ఉన్నాయి.  రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అనుమానస్పద భూలావాదేవీలు ఎక్కువగా జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ మూడు జిల్లాల కలెక్టర్లను ఊచలు లెక్కపెట్టిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ భూములపై విచారణ జరిపిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్