ఢాకా టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ పై 546 పరుగుల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 662 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆఫ్ఘనిస్తాన్ నిన్న మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 45 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 115 పరుగులకే ఆఫ్ఘన్ ఆలౌట్ అయ్యింది. జట్టులో రహ్మత్ షా-30; కరీమ్ జనత్- 18; హష్మతులా షాహిది-13 (రిటైర్డ్ హర్ట్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ 4; షోరిఫుల్ ఇస్లామ్ 3; మెహిదీ హసన్ మిరాజ్, ఎబాదోత్ హోస్సేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన నజ్ముల్ శాంటో కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.