Sunday, November 24, 2024
HomeTrending NewsLulu Group : హైదరాబాద్ లో లూలూ గ్రూప్ కార్యకలాపాలు

Lulu Group : హైదరాబాద్ లో లూలూ గ్రూప్ కార్యకలాపాలు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో లూలూ గ్రూప్‌ రాష్ట్రంలో ఈ రోజు నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లూలూ సంస్థ పెట్టుబడులతో టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. తెలంగాణలో పండే పత్తి దేశంలోనే అత్యున్నతమైనదని చెప్పారు.

చేపల ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో అతిపెద్ద ఆక్వా హబ్‌ సిద్ధమవుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని వెల్లడించారు. రూ.300 కోట్లతో మెగా డెయిరీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 10 వేల ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని వెల్లడించారు.

తెలంగాణలో రూ.3500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు లూలూ గ్రూప్‌ చైర్మన్‌ యూసుఫ్‌ అలీ చెప్పారు. ఫుడ్‌ప్రాసెసింగ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయబోతున్నామని వెల్లడించారు. రూ.3 వేలకోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో షాపింగ్‌మాల్‌ ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే లూలూ మాల్‌కు సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో షాపింగ్‌ ప్రారంభిస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్