ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోన మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ అనేక దేశాల్ని వణికిస్తోంది. తూర్పు ఆసియ దేశమైన లావోస్ లో ఈ నెల 18 వ తేది వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. రాజధాని వియంటియాన్ తో సహా దేశవ్యాప్తంగా కరోన పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న వారితో మహమ్మారి వ్యాప్తి వేగంగా జరుగుతోందని లావోస్ ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ దేశానికి టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.