Monday, January 20, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్ స‌రికొత్త పోస్ట‌ర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ స‌రికొత్త పోస్ట‌ర్ అదిరింది

Surprise Poster: 
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేషన్లో  రూపొందుతోన్న‌ సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. దాదాపు 450 కోట్ల‌ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. డి.వి.వి ఎంటర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రూపొందిన‌ ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్  ట్రైలర్ ని డిసెంబర్‌ 3న విడుదల చేయాలి అనుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల డిసెంబర్‌ 9కి వాయిదా పడింది.

ఇదిలా ఉంటే… ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది ఏంటంటే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ పోషిస్తున్న కొమ‌రం భీమ్‌ పాత్రకు సంబంధించిన స‌రికొత్త‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు రామ్‌చరణ్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు మేక‌ర్స్. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్ అండ్ సాంగ్స్ కు అలాగే టీజ‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. దీంతో ట్రైల‌ర్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Also Read : డిసెంబర్ 9న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్