Sunday, September 22, 2024
Homeసినిమా‘అన్యా’స్ ట్యుటోరియల్’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

‘అన్యా’స్ ట్యుటోరియల్’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

Tutorial: దెయ్యాలు అస‌లు ఉన్నాయా? లేవా? అవి ఉంటే ఆ భ‌యం ఎలా ఉంటుంది? అదే దెయ్యం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌స్తే? ఎప్పుడూ ఊహించ‌ని మ‌లుపుల‌తో ఆర్కా మీడియా, ఆహా స‌రికొత్త హార‌ర్ వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’ వస్తుంది. ఎస్.ఎస్.రాజమౌళి ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో రెజీనా కసాండ్ర‌, నివేదితా స‌తీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను జూలై 1 నుంచి ఆహా తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమ్ చేయ‌నుంది.

ఆర్కా మీడియా శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ… ‘హారర్ చూపించాలంటే చాలా కష్టం. కానీ ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ప‌ని చేసి మ‌నంద‌రి ముందుకు తీసుకురాబోతున్నారు. ఆహా టీమ్‌తో ఇలాంటి కాన్సెప్ట్ కోసం జ‌త క‌ట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్యాస్ ట్యుటోరియ‌ల్ క‌థ విన‌గానే, ఇలాంటి ఓ స్టోరిని అంద‌రికీ చెప్పాల‌ని, అభిమాలు కూడా ఇష్ట‌ప‌డ‌తార‌నే ఈ వెబ్ సిరీస్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం. ఇది అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

నివేదితా స‌తీష్ మాట్లాడుతూ… ‘‘నేను గుంటూరు అమ్మాయిని. ఎప్పుడు తెలుగు లోగిళ్ల‌లో అడుగు పెడ‌తానా అని ఆలోచించాను. ఆ క‌ల ఈరోజు నిజ‌మైంది. ఆర్కా మీడియా, ఆహా సంస్థ‌లు క‌ల‌యిక‌లో వ‌స్తున్న అన్యాస్ ట్యుటోరియ‌ల్ వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వెబ్ సిరీస్‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకున్నాఉ. ఇన్నేళ్ల త‌ర్వాత నా మాతృభాష‌లో అవ‌కాశం వ‌చ్చింది. అంద‌రికీ అన్యాస్ ట్యుటోరియ‌ల్ న‌చ్చుతుంద‌ని, ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్