Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్Asia Cup: సూపర్ 4 కు ఆఫ్ఘన్

Asia Cup: సూపర్ 4 కు ఆఫ్ఘన్

ఆసియ కప్ క్రికెట్ -2022లో ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో  బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఆరంభ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించిన ఆఫ్ఘన్ జట్టు నేటి విజయంతో టాప్ ఫోర్ లో  చోటు దక్కించుకుంది. బంగాదేశ్ ను 127పరుగులకే కట్టడి చేసిన ఆఫ్ఘన్ ఈ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.

షార్జా క్రికెట్  స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముజీబుర్ రెహ్మాన్ ధాటికి 28పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. వీటిలో ముజీబ్ కు మూడు, రషీద్ కు ఒకటి దక్కింది.  జట్టు స్కోరు 53 వద్ద రషీద్ మరో వికెట్ పడగొట్టాడు. మోసద్దేక్ హుస్సేన్ ఒక్కడే 48పరుగులతో నాటౌట్  గా నిలిచి రాణించాడు. మహ్ముదుల్లా 25పరుగులు చేశాడు.  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబుర్, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

ఆ తర్వాత ఆఫ్ఘన్ 15పరుగుల వద్ద తొలి వికెట్ (రహ్మతుల్లా గుర్జాబ్ -11) కోల్పోయింది. మరో ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ నబీ కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ దశలో ఇబ్రహీం జర్డాన్-42; నజీబుల్లా జర్డాన్ -43 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయం అందించారు.

ముజీబుర్ రెహ్మాన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : Asia Cup-2022: దాయాదుల పోరులో ఇండియాదే విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్