Sunday, January 19, 2025
HomeTrending Newsఖైదీలకు ఎయిడ్స్ పై అనేక అనుమానాలు

ఖైదీలకు ఎయిడ్స్ పై అనేక అనుమానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా జైల్లో  వందకుపైగా ఖైదీలు ఎయిడ్స్ బారిన పడటం సంచలనంగా మారింది. హెచ్‌ఐవీ బారిన పడిన ఖైదీల సంఖ్య 140కి చేరినట్లు దస్నా జైలు అధికారి అలోక్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకినట్లు ఆయన వివరించారు. వారికి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు సింగ్‌ తెలిపారు. ‘దస్నా జైలు ఖైదీలతో కిక్కిరిసి పోయింది. జైలులో 1,706 ఖైదీలను ఉంచేందుకు మాత్రమే సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం 5,500 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 140 మందికి హెచ్‌ఐవీ నిర్ధారణ అయ్యింది. అందులో 35 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించాం. 2016 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 120 నుంచి 150 మంది హెచ్‌ఐవీ బాధితులు జైల్లో ఉన్నారు’ అని అలోక్‌ సింగ్‌ వివరించారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జైల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికీ హెచ్‌ఐవీ, టీబీ పరీక్షలు తప్పనిసరి. ఈ క్రమంలో 2016లో ఘజియాబాద్‌ దస్నా జిల్లా జైళ్లలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ క్యాంపులను రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ చేపట్టింది. అప్పట్లో కేవలం 49 మందికి మాత్రమే ఎయిడ్స్‌ ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా హెచ్‌ఐవీ, టీబీ పరీక్షలను తప్పనిసరిగా చేపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఖైదీకి హెచ్‌ఐవీ నిర్ధారణ అయితే, వారికి అక్కడే ఉండే ఇంటిగ్రేటెడ్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ ట్రీట్మెంట్‌ సెంటర్లో (ఐసీటీసీ) ఏఆర్‌వీ చికిత్స అందిస్తున్నారు.ఇక 2016 నుంచి సరాసరి 120 నుంచి 150 మంది హెచ్‌ఐవీ సోకిన ఖైదీలు ఆ జైల్లో ఉంటున్నారు. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉన్నారు.

ఈ ఖైదీలు డ్రగ్స్‌కు బానిసలయ్యారని తెలిపారు. ఈ వ్యాధి సోకిన సూదితో ఇంజెక్షన్ ఎక్కిస్తే రక్తం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వీరిలో చాలా మందికి ఒకే సిరంజి లేదా సూదితో మత్తుగా ఉండటం వల్ల ఈ వ్యాధి వచ్చిందని సమాచారం. అయితే వీరికి శృంగారం ద్వారా ఎయిడ్స్ సోకిందా? అసహ జ శృంగారానికి వీరు పాల్పడ్డారా? లేక ఇంజక్షన్ ఒకరికి ఇచ్చింది మరొకరికి ఇచ్చి ఇంతమందికి సోకేలా చేశారా? అన్న దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. జైలులో ఖైదీలు బయట నుంచి వ్యభిచారుణులను తెప్పించుకొని ఇలా ఎయిడ్స్ తెచ్చుకున్నారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

అసలు జైల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి. అసహజ శృంగారం జరుగుతుంటే జైలు సిబ్బంది ఎం చేస్తున్నారు. జైలు సిబ్బందికి తెలియకుండా ఈ భాగోతం జరుగుతుందా అనే కోణంలో విచారణ జరుగుతోంది.

Also Read: కాంటినెంటల్ ఆసుపత్రి అరాచకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్