India to fight for 3rd: ఇండోనేషియా, జకార్తాలోని జీబీకే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరుగుతోన్న ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్ లో టైటిల్ గెలవాలన్న ఇండియా ఆశలు నెరవేరలేదు. సూపర్-4లో నేడు సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్ 4-4తో డ్రా కావడంతో ఇండియా మూడో స్థానం కోసం రేపు జపాన్ తో తలపడనుంది.
ఇండియా తరఫున ఆట 9,21, 22, 37 నిమిషాల్లో వరుసగా నీలం సంజీప్ (పెనాల్టీ కార్నర్); మహీందర్ సింగ్ (పెనాల్టీ కార్నర్); మహేష్ శేషే గౌడ (ఫీల్డ్ గోల్) ; శక్తివేల్ మరీశ్వరన్ (ఫీల్డ్ గోల్)లు పాయింట్లు తెచ్చి పెట్టారు.
సౌత్ కొరియా తరఫున 13, 18, 28, 44 నిమిషాల్లో ఒక పెనాల్టీ కార్నర్, మూడు ఫీల్డ్ గోల్స్ సాధించింది. మ్యాచ్ సమయం ముగిసే సమయానికి చెరో నాలుగు గోల్స్ సాధించడంతో డ్రా గా ముగిసింది.
రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఇండియా-జపాన్ మధ్య మూడో స్థానం కోసం; ఆరున్నర గంటలకు సౌత్ కొరియా- మలేషియా లు టైటిల్ కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి.
Also Read : ఆసియా కప్ హాకీ: జపాన్ పై ఇండియా గెలుపు