Monday, March 10, 2025
HomeసినిమాAkhil: ఫారిన్ చుట్టూ .. ఫైట్ల చుట్టూ తిరుగుతున్న అఖిల్ కథలు!

Akhil: ఫారిన్ చుట్టూ .. ఫైట్ల చుట్టూ తిరుగుతున్న అఖిల్ కథలు!

అఖిల్ బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చిన అందగాడు. సినిమాల్లోకి రావడానికి ముందునుంచే అతనికి మంచి క్రేజ్ ఉంది .. ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు అఖిల్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. తన పేరునే టైటిల్ గా పెట్టుకుని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా దాదాపు విదేశాల్లోనే షూటింగు జరుపుకుంది. ఆ సినిమాలో అఖిల్ తో భారీ యాక్షన్ సీన్స్ చేయించారు.

అయితే ఆశించినస్థాయిలో ఆ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అఖిల్ అన్నీ చేసేయగలడు అని చెప్పడానికి తొందరపడి ఉంటారనే టాక్ వచ్చింది. అయితే ఆ తరువాత కూడా అఖిల్ కథలు చాలా వరకూ విదేశాల్లోనే తిరగడం కొనసాగుతూ వస్తోంది. ఆయన వయసుకి మించిన ఫైట్లు చేస్తూనే వెళుతున్నాడు. దాంతో అఖిల్ స్థానికతకు దూరమవుతున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది మన కథ .. హీరో మనవాడు .. మన కోసం పోరాడుతున్నాడనే ఫీలింగ్ కి ఆడియన్స్ దూరంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో అఖిల్ ‘ఏజెంట్’ తో మరోసారి యాక్షన్ ను ప్రధానంగా చేసుకుని వస్తున్నాడు. ఒక రేంజ్ లో యాక్షన్ సీన్స్ లో విరిచుకుపడినట్టుగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా కోసం అఖిల్ కండలు పెంచవచ్చు .. సిక్స్ ప్యాక్ చేయవచ్చు. కానీ అతను ఇంకా లేతగానే కనిపిస్తున్నాడు. ప్రేమకథతో ముడిపడిన పోరాటాల వరకూ ఓకే. కానీ అఖిల్ ఆ స్థాయిని దాటేసి .. స్థానికతకు దూరంగా వెళ్లిపోతున్నాడు. అఖిల్ ఈ విషయంలో ఒకసారి ఆలోచన చేయవలసి ఉందేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్