Wednesday, September 25, 2024
HomeసినిమాAkkineni Akhil: అఖిల్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

Akkineni Akhil: అఖిల్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ ప్లాప్ అయ్యింది. అందర్నీ నిరాశ పరిచింది. మరి.. అఖిల్ నెక్ట్స్ ఏంటి..? అంటే ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. సాహో, రాధేశ్యామ్ చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసిన అనిల్ చెప్పిన స్టోరీకి అఖిల్ ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ నిర్మించనుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అతి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అయితే.. ఈ సినిమాతో పాటు మరో సినిమాకి కూడా అఖిల్ ఓకే చెప్పాడట. ఇంతకీ ఎవరితో అంటే.. వంశీ పైడిపల్లితో అని తెలిసింది. అఖిల్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మూవీ ఎప్పుడో రావాల్సింది కానీ… కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇప్పుడు సెట్ అయ్యిందని టాక్.సంక్రాంతికి కోలీవుడ్ స్టార్ విజయ్ తో వారిసు సినిమా చేశాడు. ఇక్కడ అంతగా ఆకట్టుకోలేదు కానీ.. తమిళ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీ తర్వాత మరోసారి విజయ్ తోనే వంశీ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. కానీ దాని కంటే ముందు అఖిల్ తో సినిమా లైన్ లో ఉందని తెలుస్తుంది.

నాగార్జునతో వంశీ పైడిపల్లి ‘ఊపిరి’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. అప్పటి నుంచి అఖిల్ తో మూవీ చేయాలి అనుకున్నాడు కానీ.. ఇప్పుడు సెట్ అయ్యింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నది. ఏజెంట్ ఫలితం చూశాక కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు అఖిల్. వంశీ పైడిపల్లి అంటే దిల్ రాజు నిర్మాతగా ఫిక్స్ అయినట్టే. అఖిల్ తో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు మూవీ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. మరి ఇప్పుడు అఖిల్, వంశీ పైడిపల్లి సినిమాను దిల్ రాజు నిర్మిస్తారా..? లేక వేరే ఎవరైనా నిర్మిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్