Saturday, November 23, 2024
HomeTrending Newsపోలీస్ కమాండ్ కంట్రోల్ దుర్వినియోగం - ఈటల రాజేందర్

పోలీస్ కమాండ్ కంట్రోల్ దుర్వినియోగం – ఈటల రాజేందర్

సీఎం ప్రెస్ మీట్ మాట్లాడితే గంటపాటు ప్రతిపక్ష, సంఘాల నాయకులను ఆడి పోసుకుంటారు. ఇప్పుడు ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్న వ్యక్తి కేటీఆర్ అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. మునుగోడులో చావు తప్పి కన్ను లోట్టపోయినట్టు కమ్యూనిస్టు ఓట్లతో గెలిచారని ఎద్దేవా చేశారు. ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం మీద గెలిచింది అని కేటిఆర్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. మునుగోడు ఎన్నికల ఫలితాలపై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఈ రోజు హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు.

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు ఆయన మాటల్లోనే….

దబ్బనం, సూది పార్టీలు.. ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు అని అసెంబ్లీ వేదికగా అన్న కెసిఆర్.. వామపక్షాల దగరికి వెళ్లి చేతులు పట్టుకొని పొత్తు పెట్టుకున్నారు. గెలుస్తాం అనే విశ్వాసం ఉంటే పొత్తు ఎందుకు? బిడ్డ ఓడిపోతుందని తెలిసినప్పుడు నిజామాబాద్ లో మాజీ మంత్రి ఇంటికి వెళ్లారు. తరువాత పట్టించుకోలేదు. అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకొనే రకం కెసిఆర్. Lb నగర్ లో ఉన్న 35 వేల ఓట్ల కోసం.. మూడవ తేదీ పోలింగ్ అయితే రెండవ తేదీ మీటింగ్ పెట్టీ రెగ్యులర్ చేస్తా అని ktr ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసులు అధికార పార్టీ డబ్బులు, మద్యం ఎక్కడా పట్టుకోలేదు. 18900 మంది తెరాస నాయకులు మునుగోడులో ప్రజలను చెరబట్టారు. వీరు పని చేస్తున్నారా? లేదా ? డబ్బులు, కుక్కర్లు పంచుతున్నారా లేదా అని 5 గ్రామాలకు ఒక ఎస్సై ని పెట్టారు. కొంతమంది పోలీసులు కెసిఆర్ కి జీతగాళ్ళలాగా వ్యవహరించారు. ఎన్నికల కమీషన్ ఉంది అనే భయం కూడా లేదు.

హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చిన్నారి పిల్లల మీద రేప్ లు చేసే వారిమీద, డ్రగ్స్ సప్లై చేసే వారిని పట్టుకోవడానికి కాదు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయనాయకులు మాట్లాడుకునేది.. నేను నా భార్య మాట్లాడుకున్నది. నేను నా కొడుకు మాట్లాడుకునేది, నేను మా పీఏ లు మాట్లాడుకునేది వినడానికి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్.. లేకపోతే 90 లక్షల రూపాయలు ఎలా పట్టుకున్నారు. తెరాస పంచలేదా ? ఎలా డబ్బులు అక్కడిదాకా పోయాయి. పోలీస్ వాహనాల్లో తీసుకుపోయింది నిజం కాదా ? కేటీఆర్ జన్యున్ గా ఆలోచిస్తారు అని అనుకున్నాం.. రాజగోపాల్ రెడ్డికి గ్లోబల్ టెండర్ లో కాంట్రాక్ట్ వచ్చింది. మీతో ఉండగా నేను ధనస్వామ్యం అని గుర్తుకు రాలేదా ? కేటీఆర్ మీకు దమ్ముంటే పలివెల ఘటన మీద నిజాయిత గా విచారణ జరిపించండి.  పక్కా స్కెచ్ వేసుకొని నా మీద దాడి చేశారు. బీజేపీ 6 శాతం ఓట్ల నుండి 38 శాతం ఓట్లు సాధించింది. 2014 లో cpi సీపీఎం కి 30 వేల ఓట్లు వచ్చాయి. వారు ఇప్పుడు మీకు వామపక్షాల శక్తి దారపోసారు. కేటీఆర్ నువ్వేం సాధించలేదు. పెరిగిన ఓట్లు అన్నీ వామపక్షాలవే.

కెసిఆర్ 15 రోజుల్లో మునుగోడుకి ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాలి. కోమటిరెడ్డి త్యాగం చేసినందుకు రోడ్లు, మంచినీళ్లు, rdo ఆఫీస్ వస్తె సంతోష పడతారు. ఇక్కడ పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవలేము అనుకుంటున్నారు. కేటీఆర్ రోడ్లు వేస్తా అని ఒక తండాను ప్రలోభ పెట్టారు. అప్రజాస్వామిక దాడి. కేటీఆర్ ఇది మీకు మంచిది కాదు. నూతన ఉత్తేజంతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ 2023 లో అధికారంలోకి రాబోతుంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక కెసిఆర్ నిధులు ఇవ్వకనే కదా రాజీనామా చేసింది. ఎమ్మెల్యే గా ఉండి కూడా జీవచ్ఛవంలా ఉండల్సివస్తుంది అని అభివృద్ధి కోసం త్యాగం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఫైటర్, ప్రజలకు మేలు చేస్తారు అనే అంత మంది ఓటు వేశారు. ఆయన ఆశయం గెలిచింది.

కెసిఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష కాదు. తెరాస కి శ్రీరామ రక్ష సీపీఐ, సీపీఎం, MIM, కమాండ్ కంట్రోల్ సెంటర్ అందులో పనిచేస్తున్న పోలీసులు. కెసిఆర్ ఆయన కుటుంబం పవర్ మాంగర్స్.. అధికారం లేకపోతే బ్రతకలేరు. అధికారం కోసం ఏం అయినా చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీ పోడియం దగ్గర పడుకొని.. తెల్లారి అక్కడే స్నానం చేసి ఆందోళన చేసినం. అప్పటి పాలకులకు టాలరెన్స్ ఉండే.. కానీ మీరు మాత్రం నేను అసెంబ్లీకి వస్తె మెడలు పట్టి బయటికి పంపారు. కమ్యూనిస్టు పార్టీలు నోరులేని వారి పక్కన నిలబడేవారు. కానీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆత్మ పరిశీలన చేసుకోండి. మావోయిస్ట్ లు విమర్శిస్తున్నారు. 2015 లో శ్రుతి, విద్యాసాగర్ లను ఎన్ కౌంటర్ చేసింది కెసిఆర్ కాదా. వరవరరావు దగ్గరికి, కూర రాజన్న దగ్గరికీ పోలేదా ? అలాంటి వ్యక్తి ఎన్కౌంటర్ చేసి ఏం సందేశం పంపారు. నా ఇలాకాలో మీకు స్థానం లేదు అని కాదా ? నచ్చకపోతే జర్నలిస్ట్ లను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్న ఈటల రాజేందర్ ఒక్క అక్రమం చేసి డబ్బులు సంపాదించిన అని నిరూపించు. ఊరికే వాడు ఉన్నంత వరకే తరిమేవారు ఉంటారు అని కెసిఆర్ కేటీఆర్ మర్చిపోవద్దని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హెచ్చరించారు.

Also Read : మునుగోడు పాఠం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్