Sunday, January 19, 2025
HomeసినిమాAllu Arjun: 'దసరా' పై బన్నీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Allu Arjun: ‘దసరా’ పై బన్నీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సక్సెస్ సాధించింది. ముఖ్యంగా నాని, కీర్తి సురేష్‌ నటన, కొత్తవాడైనప్పటికీ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది అంటూ దసరా టీమ్ పై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల చిరంజీవి సైతం దసరా టీమ్ ని అభినందించారు. ఈ సినిమా రిలీజై మూడు వారలు అవుతున్నప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం విశేషం.

తాజాగా అల్లు అర్జున్ దసరా సినిమా పై కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ అల్లు అర్జున్ ఏమన్నారంటే… నాని నటన అద్భుతం. కీర్తి సురేష్ పాత్రుకు తగ్గట్టుగా బాగా నటించింది. సంతోష్ నారయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సత్యన్ అద్భుతమైన కెమెరా పనితనం చూపించారు. అంతే కాకుండా ఈ సినిమాను కెప్టెన్ ఆఫ్ ది షిప్ శ్రీకాంత్ ఓదెల డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ అద్భుతంగా తీశాడు. వేసవిలో వచ్చిన అసలైన దసరా. నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు బన్నీ.

దసరా చిత్రం ఓవర్ సీస్ లో 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. నాని కెరీర్ లో 2 మిలియన్ క్రాస్ చేసిన మొదటి చిత్రంగా నిలిచింది. అలాగే 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి నాని కెరీర్ అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇలా నానికి కలెక్షన్స్ తో పాటు అద్భుతంగా నటించాడనే పేరును కూడా తీసుకువచ్చింది దసరా చిత్రం. ఇంతటి విజయాన్ని సాధిస్తుందని నాని కథ విన్నప్పుడే అనుకున్నాడట. అది నిజం కావడం చాలా ఆనందంగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. నాని తదుపరి చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్