Saturday, July 27, 2024
HomeTrending NewsWorld Heritage Day: రామప్పలో వారసత్వ దినోత్సవ వేడుకలు

World Heritage Day: రామప్పలో వారసత్వ దినోత్సవ వేడుకలు

ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని (ఏప్రిల్ – 18) పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెరిటేజ్ తెలంగాణ శాఖ, ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో” శిల్పం, వర్ణం, కృష్ణం ” – ‘సెల్ బరేటింగ్ ది హెరిటేజ్ రామప్ప’ పేరుతో ‘వరల్డ్ హెరిటేజ్ డే’ మెగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం.

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రామప్ప దేవాలయం ప్రాంగణంలో ఫుడ్ ఫెస్టవల్, ప్రముఖ సంగీత దర్శకులు SS తమన్, డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి సింగర్ కార్తీక్, నవీన్ లతో పాటు 300 మంది కళాకారులు కలిసి నాట్య ప్రదర్శన, వాయిలిన్ షో, లేజర్ షో లను నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ప్రపంచ వారసత్వ దినోత్సవం పురస్కరించుకొని రామప్ప దేవాలయం లో పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే విధంగా నిర్వహిస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పురావస్తు, చారిత్రక సంపద, ప్రకృతి జలపాతాలు, అందమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను, తెలంగాణ హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలో పరిరక్షిస్తున్నామన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందే చారిత్రక వారసత్వ పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయన్నారు. పురాతన కట్టడాలను చారిత్రక సంపద పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన కళా సంపద, సంస్కృతి , సాంప్రదాయాలు, చారిత్రక , వారసత్వ సంపద ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న చారిత్రక వారసత్వ సంపదపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో రామప్ప దేవాలయంతో పాటు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలు గుర్తింపుకు అర్హత కలిగిన మరో 10 , 15 చారిత్రక, వారసత్వ కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయన్నారు.

రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల పరిరక్షణకు తెలంగాణ పర్యాటక, హెరిటేజ్ శాఖల అధ్వర్యంలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టమన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. దేశ వ్యాప్తంగా యునెస్కో సంస్థ ఇప్పటివరకు 40 చారిత్రక, వారసత్వ కట్టడాలను, స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించిందన్నారు. ఇందులో రామప్ప దేవాలయం 39వ కట్టడం గా యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తించిందన్నారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణా మండలం, ముడుమాల గ్రామంలోని 3వేల సంవత్సరాల క్రితం ఆదిమానవునీ ఆనవాళ్లు , నిలువు రాళ్ల సమాధులను , నల్గొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో ఉన్న శ్రీ ఛాయ సోమేశ్వర దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు కోసం ప్రతిపాదనలను సమర్పించామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్