Saturday, January 18, 2025
Homeసినిమాఅప్పుడు 'తగ్గేదే లే' .. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' : బన్నీ

అప్పుడు ‘తగ్గేదే లే’ .. ఇప్పుడు ‘అస్సలు తగ్గేదే లే’ : బన్నీ

అల్లు శిరీష్ హీరోగా ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో ‘ఊర్వశివో రాక్షసివో‘ సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 సమర్పణలో ఈ సినిమా ఈ నెల 4వ తేదీన భారీస్థాయిలో థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్ కీ .. హాట్ లుక్స్ కీ ఈ సినిమాలోని రొమాన్స్ కి .. యూత్ బాగా కనెక్ట్ అయింది. ఇక అనూ యాక్టింగ్ కూడా ఈ సినిమాకి ఒక హైలైట్ గా నిలిచింది. తెలుగుకి సంబంధించి ఆమె కెరియర్లో బెస్ట్ రోల్ ఇదేనని చెప్పచ్చు. అల్లు అర్జున చీఫ్ గెస్టుగా ఈ సినిమా నిన్న రాత్రి ‘బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ ను జరుపుకుంది.

అల్లు అరవింద్ మాట్లాడుతూ .. బన్నీ ఆల్రెడీ ఆలిండియా స్టార్. ఇక శిరీష్ స్టార్ గా ఎదుగుతున్నాడు. తమ్ముడు సినిమాకి అన్న చీఫ్ గెస్టుగా వచ్చాడు. ఒక తండ్రిగా ఈ సమయంలో నాకంటే ఆనందపడేవారు ఎవరుంటారు?. ఈ సినిమాకి డైరెక్టర్ గా రాకేశ్ శశి కరెక్ట్ అనుకున్నాను … హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ కరెక్టు అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే అతను తీశాడు .. నేను ఆశించినట్టుగానే ఆమె చేసింది. ఈ సినిమా హిట్ గా నిలబడటం వెనుక బన్నీ వాసు కృషి కూడా ఉంది” అన్నారు.

ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ .. “ఈ సినిమా మా ఫ్యామిలీకి చాలా స్పెషల్ అనుకుని చేశాము. శిరీష్ గట్టి హిట్ కొట్టాలనీ, అప్పుడు నేను స్టేజ్ పై మాట్లాడాలనే రోజు కోసం ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చాను. ఆ ముచ్చట ఇప్పుడు తీరింది. తను బాగా చేశాడని నేను చెబితే అది పొగిడినట్టుగా ఉంటుంది. ఆ మాట అందరూ చెబుతుంటే వినడానికి నాకు బాగుంది. ఈ రోజున నేను నా సినిమా హిట్ అయిన దానికంటే ఎక్కువగా ఆనందపడుతున్నాను. ఇక ‘పుష్ప 2’ గురించి అందరూ అడుగుతున్నారు. ఆ సినిమా గురించి మీకు ఒక అప్ డేట్ ఇస్తాను. ‘పుష్ప’లో పేలిన డైలాగ్ ‘తగ్గేదే లే’. ‘పుష్ప 2’లో మీకు కనెక్ట్ అయ్యేది ‘అస్సలు తగ్గేదేలే’ అంటూ మేనరిజమ్ తో కూడిన తన డైలాగ్ ను రివీల్ చేస్తూ ఫ్యాన్స్ ను హుషారెత్తించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్