Sunday, January 19, 2025
HomeTrending Newsఅమలాపురం ఘటన దురదృష్టకరం: శ్రీకాంత్ రెడ్డి

అమలాపురం ఘటన దురదృష్టకరం: శ్రీకాంత్ రెడ్డి

అమలాపురం ఘటన దురదృష్టకరమని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పోలీసులు  సంయమనంతో వ్యవహరించటం అభినందనీయమన్నారు. కోనసీమను అంబేద్కర్ కోససీమ జిల్లాగా మార్చమని ప్రతి ఒక్కరూ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయంపైన ప్రతి ఒక్కరూ డిమాండ్ చేశారన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం అమలాపురం వెళ్లి ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిందేనని డిమాండ్ చేసిన విషయం అందరూ చూసారన్నారు. జనసేన వాళ్ళు నిరహార దీక్షలు కూడా చేపట్టారన్నారు. ప్రతి రోజూ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న కొంతమంది కుట్రదార్రులు చేసిన ప్రయత్నంలో భాగంగా నిన్నకూడా ఇక్కడ అల్లరిమూకలు పెట్రేగిపోయి ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలలో ఆరాచాకాలు సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు.

అక్కడ పొలీసులు కాల్పులు జరిపి ఉండి ఉంటే కనీసం పదుల సంఖ్యలో అక్కడ మరణాలను చూసి వుండేవాళ్ళమన్నారు.అక్కడవున్నటువంటి వాళ్లకు , వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి నష్టం జరగకూడడదన్న ఉద్దేశ్యంతో,పోలీసులకు రాళ్ల దెబ్బలు తగిలినా, జిల్లా ఎస్ పి ని గాయపరచినా సంయమనం కోల్పోకుండా ప్రాణ నష్టం జరగకూడదని వారు సంయమనం పాటించారన్నారు. నిజంగా ఇది దురదృష్టకర ఘటన అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును అందరూ కోరిన తరువాత, ప్రజల అభీష్టం మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా గా నామకరణం చేసిన తరువాత, ఈ రోజు వెనక ఉండి నడిపించిన కొంతమంది ఉద్దేశ్యాలు విచారణలో బయటపడతాయన్నారు.రాజకీయాలలో రెండు నాల్కల ధోరణి చంద్రబాబు నాయుడుకు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. ఇది మంచిపద్ధతికాదన్నారు. ప్రజలును రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదన్నారు.అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి అన్నారు.వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్న ప్రతిపక్ష పార్టీల రాద్ధాంతాలును, అల్లర్లును ప్రజలు గమనిస్తున్నారన్నారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.సంఘటనలోగాయపడ్డ పోలీసులు, అధికారులుత్వరగా కోలుకోవాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Also Read : అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత 

RELATED ARTICLES

Most Popular

న్యూస్