నిజాం క్రూర పాలన, రజాకార్ల ఆకృత్యాల నుంచి స్వేఛ్చ వాయువులు పీల్చిన రోజు september 17 అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు చరిత్ర లో నిలిచే పోయే రోజుగా అభివర్ణించారు. హైదరాబాద్ సంస్థానం నుంచి విమోచన పొందిన ప్రజలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఈ రోజు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. అంతకుముందు అమరవీరులకు నివాళులర్పించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారన్నారు. 75 ఏళ్ళు గడిచినా తెలంగాణలో విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహించటం లేదని, కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకున్నాయని విమర్శించారు.
కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నారని అమిత్ షా గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య నుంచి కొమురం భీమ్ వరకు తెలంగాణ ప్రాంత విముక్తి కోసం చేసిన త్యాగాలని గుర్తు చేశారు. గుండ్రం పల్లి లో నిజాం అరాచాకల్ని నేను తెలుసుకున్నాను, అది మరో జలియన్ వాల బాగ్ అని పెద్దలు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ ప్రజల పరిస్థితి మరో రకంగా ఉండేదని అమీర్ షా అన్నారు. september 17 వ తేదిన అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహించకుండా… చరిత్రను వక్రీకరించే ప్రయత్నం కొందరు చేశారని అమిత్ షా మంది పడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారికంగా నిర్వహిస్తామని హామీలు ఇవ్వటం.. అధికారంలోకి రాగానే పట్టించుకోకపోవటం తెలంగాణ ప్రజలను మోసపుచ్చటం జరిగిందన్నారు.
వేడుకలు జరుపుతున్నామని చెపుతూ.. విమోచన పేరు ఎత్తటం లేదని అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పుడు రజాకార్లు లేరని నిర్భయంగా విమోచన వేడుకలు నిర్వహించుకోవచ్చని అమిత్ షా చెప్పారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో హైదరాబాద్ విమోచన దినం చేయలేదని, ఇప్పుడు కూడా చేయడానికి జంకుతున్నారని ఆరోపించారు. విమోచన దినం చేయక పోవడం.. పోరాటంలో అమరులు అయిన వారిని అవమానించడమే అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినం చేయాలని డిమాండ్ చేసిన వారు.. అధికారం లోకి వచ్చాకా చేయలేదన్నారు. ఎవరు చేసిన చేయకున్నా కేంద్ర ప్రభుత్వం విమోచన వేడుకలు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
Also Read: