Wednesday, April 24, 2024
HomeTrending Newsఖలిస్థానీ అమృత్ పాల్ సింగ్‌ అరెస్ట్...పంజాబ్‌లో ఇంటర్నెట్ బంద్

ఖలిస్థానీ అమృత్ పాల్ సింగ్‌ అరెస్ట్…పంజాబ్‌లో ఇంటర్నెట్ బంద్

ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ జలంధర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌ పాల్‌సింగ్‌తో పాటు ఆయన అనుచరులనూ అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలనూ స్వాధీనం చేసుకున్నారు. అమృత్ పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు. కానీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వెంబడించి మరీ అరెస్ట్ చేశారు. ఇప్పటికే పంజాబ్ పోలీసులు అతడిపై మూడు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అలజడులూ చెలరేగకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్నెట్ సేవలు, SMS సర్వీసులు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. మెర్సిడెస్ కార్‌ను వదిలేసి వేరే కార్‌ను కొనుగోలు చేసిన అమృత్ పాల్ సింగ్..చాలా రోజులుగా అండర్‌గ్రౌండ్‌లో ఉంటున్నాడు. అతడిని అరెస్ట్ చేయాలంటూ చాలా రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకుంది.

అమృత్ పాల్ సింగ్ అరెస్టు తో ప్రపపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సిక్కు వేర్పాటువాదులు ఆందోళనలకు దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తే ప్రమాదం ఉంది. దీంతో కేంద్ర నిఘా వర్ఘాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించాయి.

ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా సహకరించాలని ప్రజల్ని కోరింది. ఎలాంటి వదంతులూ వ్యాప్తి చేయొద్దని సూచించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదని తెలిపింది. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేసింది. కొద్ది వారాలుగా చురుగ్గా ఉద్యమం చేస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. గత నెల ఖలిస్థాన్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. అజ్నల పోలీస్‌ స్టేషన్ వద్ద పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. అమృత్ పాల్ సింగ్ అనుచరుడిని అరెస్ట్ చేయడంపై అలజడి సృష్టించారు. ఇప్పటికే ఆరుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అమృత్ యాక్టివ్‌గా ఉండడమే కాకుండా..తనను పోలీసులు వెంటాడుతున్నారంటూ వీడియోలు పోస్ట్ చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్