Another flood threat:
గత వారం కురిసిన భారీ వర్షాలు కడప, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ ముప్పు నుంచి తేరుకోక ముందే మరో వరద గండం పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఇదే జిల్లాలపై మరో అల్ప పీడన ప్రభావం ఈ వారాంతంలో మొదలవుతుందని సంబంధిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ అల్పపీడనం వల్ల నవంబర్ 27 నుంచి నెల్లూరు జిల్లాలో వర్షాలు పదయతాయని తెలిపారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 మధ్యలో నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో కురుస్తాయని అధికారులు చెప్పారు. మిగిలిన అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నిన్న నాలుగు జిల్లాల కలెక్టర్లతో జరిగిన సమీక్ష సందర్భంలో సిఎం జగన్ కూడా ఈ విషయమై కొన్ని సూచనలు చేశారు. ఈనెల 26 నుంచి వర్షాలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని, 27, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని సిఎం ప్రస్తావించారు.
Also Read : తక్షణ వరద సాయం : సిఎం విజ్ఞప్తి