Sunday, January 19, 2025
HomeTrending NewsAP CM Jagan: సీఆర్డీఏ పరిధిలో నేడు పట్టాల పంపిణీ

AP CM Jagan: సీఆర్డీఏ పరిధిలో నేడు పట్టాల పంపిణీ

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో నేడు శుక్రవారం మరో ముందడుగు పడనుంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు నేడు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు  ఈ ప్రాంతంలో 443.71 కోట్ల రూపాయలతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా నేడు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటాపాలెంలో జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ॥అ॥ ల టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే అన్ని హక్కుల అందజేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరుతోందని ప్రభుత్వం తెలియజేసింది.  గత ప్రభుత్వంలో ఇదే ఇంటికి అసలు, వడ్డీలతో కలిపి ఒక్కొక్కరు రూ. 7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొంది.

లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతాన్ని రాయితీగా అందిస్తూ, 365 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, 430 చదరపు అడుగుల  74,312 టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రూ. 50 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వారు చెల్లించాల్సిన రూ. 482 కోట్ల భారాన్ని కూడా  జగన్ ప్రభుత్వం భరిస్తోంది.

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల” ద్వారా సీఆర్డీఏ పరిధిలో అన్ని మౌలిక సదుపాయాలతో మొత్తం 25 లేఅవుట్లు చేసి..
• 23,762 మంది గుంటూరు జిల్లా అక్కచెల్లెమ్మలకు 11 లేఅవుట్లు..
• 27,031 మంది ఎన్టీఆర్ జిల్లా అక్కచెల్లెమ్మలకు 14 లేఅవుట్లు..
• 80,000 హద్దు రాళ్ల ఏర్పాటు..
• 95.16 కి.మీలలో గ్రావెల్ తో అంతర్గత రవాణా వ్యవస్థ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించింది.

ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణానికి మరో రూ. 1,280 కోట్లు, మౌలిక సదుపాయాలకు మరో రూ. 700 కోట్లు.. మొత్తం దాదాపు రూ.2,000 కోట్ల వ్యయంతో “వైఎస్సార్ జగనన్న కాలనీ”ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించింది.

అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30.60 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ చేశామని, 21 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం.. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు కనీసం రూ.5 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు లబ్ధి.. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుండి 3 లక్షల కోట్ల సంపద ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్