Sunday, February 23, 2025
HomeTrending Newsనేడు గవర్నర్ తో సిఎం భేటీ

నేడు గవర్నర్ తో సిఎం భేటీ

CM-Governor: ఢిల్లీ పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం కానున్నారు. నిన్న దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యారు.

కాసేపట్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్రానికి సంబంధించిన రోడ్డు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటలకు గవర్నర్ ను కలుసుకుంటారు.

రేపు ఏడో తేదీన ఉదయం నరసరావుపేటలో గ్రామ/వార్డు వాలంటీర్లకు జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న సిఎం జగన్ మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ లోనే మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుంటారు. ఆ మర్నాడు ఎనిమిదో తేదీన గవర్నర్ కు ఈ రాజీనామాలు సమర్పిస్తారు. 11న రాష్ట్ర కొత్త కేబినేట్ కొలువు తీరనుంది. ఈ విషయమై చర్చించేందుకే సిఎం గవర్నర్ ను కలుస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Also Read : ఏప్రిల్11న కేబినెట్ ప్రక్షాళన?

RELATED ARTICLES

Most Popular

న్యూస్