Saturday, April 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వక్ఫ్ భూములు స్వాధీనం చేసుకోండి : అంజాద్ భాషా

వక్ఫ్ భూములు స్వాధీనం చేసుకోండి : అంజాద్ భాషా

వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమ శాఖ) ఎస్.బి. అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను నిర్ణీత కాలవ్యవధిలో స్వాధీదీనపర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారులు కీలక భూమిక పోషించాలని దిశా నిర్దేశం చేశారు.  ఎస్ బి.అంజాద్ బాషా అద్యక్షతన 13 జిల్లాల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారులు, వర్కు ఇన్ స్పెక్టర్లు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సచివాలయ ప్రాంగణంలో బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం సూచనలు:

  • విజయవాడ, విశాఖపట్నం లలో వచ్చే విద్యా సంవత్సరం నుండి అల్పసంఖ్యాక విద్యార్థుల వసతి గృహాలను అద్దె భవనాల్లోనైనా ప్రారంబించాలి.
  • అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమాన్ని (PMJVK) పూర్తిస్థాయిలో వినియోగించుకొనే అంశంపై అధికారులు ప్రత్యేక శ్రద్దచూపాలి.
  • PMJVK పథకం క్రింద ముందుగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కళాశాలల భవనాలు నిర్మించడం వల్ల ఉపయోగం లేదు. అద్యాపకులు, సిబ్బంది పోస్టు మంజూరు విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
  • ప్రాంతాల వారీగా అవసరాలను బట్టి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేని వృత్తి నైపుణ్య అభివృద్ది కేంద్రాలు, సద్బావన మండపాలు, డిజిటల్ లైబ్రరీలు, హస్తకళల శిక్షణ కేంద్రాల ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం వంటి పనులను ప్రతిపాదించాలి.

మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ ఏ.ఎండీ. ఇంతియాజ్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ శారదా దేవి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి, వక్ఫ్ బోర్డు సీఈవో ఆలీం భాష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్