Sunday, May 19, 2024
HomeTrending Newsఈటెల రాజేందర్ ది ఆత్మవంచన

ఈటెల రాజేందర్ ది ఆత్మవంచన

ఈటెల రాజేందర్ కు టీఆరెస్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని , ఆయనకు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అడిగారు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక సమావేశం ఈ రోజు జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషణ, పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటైజేషన్ ప్రక్రియ, టీఆర్ఎస్ సభ్యుల జీవిత భీమా, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి, పార్టీ ఇతర వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చించారు.  భోజన విరామ సమయంలో కేటిఆర్ మీడియా తో కొద్ది సేపు ఇష్టాగోష్టి గా గడిపారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్ని టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావించారు.

మంత్రిగా ఉండి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఈటెల రాజేందర్ బహిరంగంగా తప్పు పట్టారని , మంత్రి వర్గ సమావేశంలో ఈటెల ఎపుడైనా అసమ్మతి తెలియ జేశారా అని కేటిఆర్ ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ తప్పు  చేయకుండానే ఒప్పుకున్నారా?. ఈటెల రాజేందర్ పై సానుభూతి ఎందుకు ఎట్లా వస్తదన్నారు.

బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని తారక రామారావు డిమాండ్ చేశారు. ఈటెల పై అనామకుడు ఉత్తరం రాస్తే సీఎం చర్యలు తీసుకోలేదన్న కేటిఆర్ సాక్షాధారాలు ఉన్నయి కనుకే చర్యలు తీసుకున్నామన్నారు. ఈటెల రాజేందర్ ఆత్మ వంచన చేసుకుంటున్నారు. ఐదేళ్ల కిందట నుంచి కేసీఆర్ తో గ్యాప్ ఉంటే ఎందుకు మంత్రిగా కొనసాగారు?. ఐదేళ్ల నుంచి ఈటెల రాజేందర్ అడ్డంగా మాట్లాడినా మంత్రిగా కేసీఆర్ కొనసాగించారన్నారు.

ఈటెల రాజేందర్ చివరి వరకు పార్టీలో ఉండాలని నేను వ్యక్తిగతంగా ప్రయత్నం చేశానన్న కేటిఆర్ ఈటెల రాజేందర్ సీఎం ను కలువను అని స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత నేను ఎమ్ చేయగలనన్నారు. ఈటెల రాజేందర్ పార్టీలోకి రాకముందు కూడా కమలాపురం బలంగానే ఉందని, ఇప్పుడు కూడా హుజురాబాద్ బలంగానే ఉందన్నారు.

కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎమి ఇచ్చిందని కేటిఆర్ మండిపడ్డారు. జల జీవన్ మిషన్ కు అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తుంది ఎం పాపం చేసిందని తెలంగాణకు ఇవ్వడం లేదన్నారు. టీఆరెస్ అభివృద్ధి ని  బీజేపీ ఖాతాలో ఈటెల ఎలా వేసుకుంటారు?. హుజురాబాద్ లో వ్యక్తుల మధ్య కాదు పోటీ- పార్టీల మధ్య మాత్రమే ఉంటుందని కేటిఆర్ తేల్చి చెప్పారు.

జల వివాదాల్లో న్యాయం గెలుస్తుందని, ఏపీ ఎన్ని కేసులు వేసినా మేము న్యాయబద్ధంగా ముందుకు వెళ్తామని కేటిఆర్ స్పష్టం చేశారు.

ఒక్కో వారంలో ఒక్కొక్కరు  వ్రతాలు చేస్తారు – షర్మిల అలా చేస్తోందని కేటిఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడగలుగుతామన్న కేటీఆర్ ప్రతిపక్షాలకు ఎమ్ మాట్లాడాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్