We reject: రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన పీఆర్సీ జీవోలను తిరస్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ప్రకటించారు. నిన్న విడుదల చేసిన జీవోలపై వారు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు నష్టం కలిగించే పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని, ఈనెల 20న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస రావు హెచ్చరించారు. తాము అనుకున్న విధంగా ఫిట్ మెంట్ ఇవ్వకపోయినా, హెచ్ఆర్ఏ, సిసిఏల్లో ఎలాంటి కోత పెట్టరని అనుకున్నామని, అయితే హెచ్ఆర్ఏలో కొత్త విధించడం దారుణమని బండి మండిపడ్డారు. ఇకపై పీఆర్సీ పదేళ్లకోసారి ఉంటుదంటూ జీవోల్లో పేర్కొనడాన్ని ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఆర్ధిక పరిస్థితులు బాగున్నప్పుడే పీఆర్సీ ఇవ్వాలని అంతే కానీ ప్రస్తుతం వస్తున్న జీతాలు తగ్గించేలా పీఆర్సీని అమలు చేయడం ఏమిటని అయన ఆవేదన వెలిబుచ్చారు. హెచ్ఆర్ఏ 16 శాతానికి తగ్గించడం, గ్రాడ్యుటీ సీలింగ్ ఎత్తివేయడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను కూడా ఎత్తివేయడం సబబు కాదని, ఐ ఆర్ కంటే ఫిట్ మెంట్ ఎప్పుడైనా తక్కువ ఉందా అని బండి ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంక్షేమం కోసం భేషజాలు లేకుండా అందరూ కలిసి రావాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మూసపూరితంగా జీవోలు విడుదల చేసిదని అయన విమర్శించారు.
Also Read : 23.29 శాతం ఫిట్ మెంట్: వైఎస్ జగన్