Sunday, September 8, 2024
HomeTrending Newsఆరోగ్య శ్రీ ద్వారా ఇకపై 3255 చికిత్సలు

ఆరోగ్య శ్రీ ద్వారా ఇకపై 3255 చికిత్సలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతరరాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్రలు, సేవారత్న, ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ  కింద  వైద్య చికిత్సల సంఖ్యను 3255కి పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వచ్చింది.

  • మే 2019నాటికి వైద్య చికిత్సల సంఖ్య 1059
  • జనవరి 2020లో 2059కి పెంచుతూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం
  • వైద్యం ఖర్చు వేయి రూపాయల ఖర్చుకు పైబడ్డ చికిత్సలకూ వర్తింపు
  • జులై 2020లో ఈ సంఖ్య  2200 కు పెంపు
  • అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్‌ చికిత్స ప్రొసీజర్లు
  • నవంబర్‌ 2020లో 2436కుకు  పెంపు. బోన్‌ మ్యారోతోపాటు 235 ప్రొసీజర్ల చేరిక.
  • మే-జూన్‌ 2021లో 2446కు పెంపు. 10 కోవిడ్‌ ప్రొసీజర్ల చేరిక.
  • ఇప్పుడు ఈ సంఖ్యను 3255 కు పెంచుతూ నిర్ణయం

ఆరోగ్య శ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని, ఎక్కడా కూడా బకాయిలు లేకుండా చూస్తున్నామని అధికారులు సమావేశంలో చెప్పారు.  దీనిద్వారా ఎంపానెల్డ్‌ ఆస్పత్రుల్లో నమ్మకం, విశ్వాసం కలిగిందని,  రోగులకు మరిన్ని వైద్య సేవలను ఇప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని వివరించారు.  104 కాల్‌ సెంటర్‌ ద్వారా ఆరోగ్యశ్రీ రిఫరల్‌ సర్వీసులు కూడా అందిస్తున్నామని విరించారు.  ఆరోగ్య శ్రీ కింద అందుతున్న సేవలపై ఎంపానల్డ్, విలేజ్‌ క్లినిక్స్‌, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో బోర్డులు ఉంచుతున్నామని, పూర్తి సమాచారంతో బుక్‌లెట్స్‌కూడా ఇస్తున్నామని, ఆస్పత్రులు వివరాలు, అందుతున్న సర్వీసుల వివరాలు కూడా ఇందులో పొందుపరిచామని పేర్కొన్నారు.

Also Read : ఆరోగ్య శ్రీ ద్వారా ఇకపై 3255 చికిత్సలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్