War Memorial: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన సతీమణి సుప్రవ తో కలిసి నేడు ఉదయం ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన గవర్నర్ జాతి సేవలో ప్రాణాలర్పించిన వీర యోధులకు పుష్పాంజలి ఘటించారు.
స్వాతంత్ర్యం అనంతరం ఇప్పటివరకూ 26,000 మందికి పైగా భారత సాయుధ దళాల సైనికులు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి త్యాగం చేశారు. వారి త్యాగాలకు గుర్తుగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నిర్మించి సాయుధ దళాలకు జాతి కృతజ్ఞతలు తెలుపుతోంది. ఈ స్మారక చిహ్నం మనలో ఓ స్పూర్తిని, నైతిక విలువలు, త్యాగం, జాతీయవాదాన్ని బలోపేతం చేయడానికిన తోడ్పడుతోంది. గవర్నర్ హరిచందన్ వార్ మెమోరియల్‌ను సందర్శించిన అనంతరం విజిటర్స్ బుక్ లో సందేశాన్ని రాశారు.