Friday, October 18, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కోవిడ్‌ అనాథలకు ఆపన్నహస్తం

కోవిడ్‌ అనాథలకు ఆపన్నహస్తం

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. అనాథలైన పిల్లలను చేరదీసి బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి, రక్షణ కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరక్టర్ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు.

తల్లిదండ్రులు లేక ఏ ఆదరణ లేని చిన్నారుల కోసం జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కృతికా శుక్లా చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా మొత్తం 31 కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. జిల్లాలవారీగా వాటి వివరాలను వెల్లడించారు.

కోవిడ్‌ వల్ల అనాథలైన పిల్లల వివరాలు తెలిపేందుకు ఇప్పటికే 24 గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ నెంబర్లు 181, 1098(చైల్డ్ లైన్)ను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించిన కృతికా శుక్లా, ఈ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి తల్లిదండ్రులు లేక ఒంటరైన బాల, బాలికల సమాచారాన్ని ఎవరైనా అందించవచ్చని అన్నారు.

ప్రభుత్వ ఆదేశానుసారం అనాథలైన చిన్నారుల సంరక్షణతో పాటు, తల్లిదండ్రులు ఇద్దరూ కోవిడ్‌బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వుంటే వారి పిల్లల ఆలనాపాలనా కూడా ఈ కేంద్రాలలోనే తాత్కాలికంగా చూడనున్నట్టు కృతికా శుక్లా తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్