సర్వర్ లో సాంకేతిక కారణాల వలన రాష్ట్రంలో 108 అత్యవసర సర్వీసెస్ ఫోన్ నెంబర్ తాత్కాలికంగా పని చేయడం లేదని 104 & 108 సేవల అడిషనల్ సిఈఓ ఆర్. మధు సూదన రెడ్డి వెల్లడించారు. తాత్కాలికంగా మరో నంబర్ ను ఏర్పాటు చేశామని, అంబు లెన్స్ సర్వీస్ కొరకు 104(1) కి ఫోన్ చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.