Sunday, September 8, 2024
Homeసినిమా'అశోక్ గల్లా2' గ్రాండ్ గా ప్రారంభం

‘అశోక్ గల్లా2’ గ్రాండ్ గా ప్రారంభం

‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన మహేష్ బాబు మేనల్లుడు, కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా తన రెండవ ప్రాజెక్ట్- #అశోక్ గల్లా2 తో రాబోతున్నారు. అ!, జాంబీ రెడ్డి వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించి ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ చేస్తున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు వెంకటేష్ క్లాప్‌ కొట్టగా, నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేయగా, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని మిర్యాల రవీందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది.. మేకర్స్, ప్రశాంత్ వర్మకు అందజేశారు. ఆది శేషగిరిరావు, బివిఎస్‌ రవి, గల్లా జయదేవ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తారు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన పాపులర్ కంపోజర్  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రఫర్ ప్రసాద్ మూరెళ్ల కెమరామెన్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

మూవీ లాంచ్ ఈవెంట్ సందర్భంగా అశోక్ గల్లా మాట్లాడుతూ… ప్రశాంత్ వర్మ షో రన్నర్ గా వుండటం నాకు, దర్శకుడు అర్జున్, మా టీం అందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సాయి మాధవ్ గారు ఈ సినిమాకి మాటలు రాయడం ఆనందంగా వుంది. నేను సాఫ్ట్ గా ఉంటానని అంటారు. ఈ సినిమాతో నన్ను అందరూ రఫ్ లుక్ లో కూడా యాక్సప్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మీ అందరి కోసం ఒక మంచి సినిమాతో రాబోతున్నాం. లాంచ్ ఈవెంట్ కి విచ్చేసి మాకు బెస్ట్ విశేష్ అందించిన వెంకటేష్ గారికి, బోయపాటి గారికి, నమ్రత అక్కకి, అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్