Sunday, January 19, 2025
HomeTrending Newsజమ్ముకాశ్మీర్ లో మరో పండిట్ హత్య

జమ్ముకాశ్మీర్ లో మరో పండిట్ హత్య

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో కాశ్మీర్ పండిట్ ను పొట్టన పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. సోఫియన్ లోని చౌదరి గుండ్ వద్ద కశ్మీరీ పండిట్‌పై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. చనిపోయిన వ్యక్తిని పురన్  కిషన్ భట్ గా గుర్తించారు. తన వ్యవసాయ క్షేత్రం యాపిల్ తోటకు ఈ రోజు ఉదయం కిషన్ భట్ వెళుతుండగా కాపు కాచిన ముష్కర మూకలు కిషన్ భట్ పై కాల్పులు జరిపాయి. ఆయానను ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.

దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన స్థలం చుట్టూ పక్కల ప్రాంతాలని జల్లెడ పడుతున్న పోలీసులు..సోఫియన్ నగరంలో కర్దేన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తొందరలోనే ఘటనకు కారణమైన వారిని పట్టుకుంటామని, ఉగ్రవాదులను కటినంగా అణచి వేస్తామని పోలీసులు ప్రకటించారు. అయితే కాశ్మీర్ పండిట్ లే టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులు చేయటంతో మళ్ళీ పాత రోజులు వచ్చాయనే భయంలో పండిట్ కుటుంబాలు ఉన్నాయి.

Also Read : పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆక్రమిత కశ్మీర్ లో నిరసనలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్