Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ICC Men’s T20 World Cup 2022: ఐర్లాండ్ పై ఆసీస్ విజయం

ICC Men’s T20 World Cup 2022: ఐర్లాండ్ పై ఆసీస్ విజయం

పురుషుల టి 20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ ఇచ్చిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓ దశలో 25పరుగులకే 5 వికెట్లు కోలోయిన ఐర్లాండ్ జట్టులో లోర్కాన్ టక్కర్ ఒంటరి పోరాటం చేసి 48 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్సర్ తో 71  పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు, దీనితో ఐర్లాండ్ భారీ ఓటమి నుంచి తప్పించుకుంది.

బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ  మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3) ఈ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. కెప్టెన్ పించ్-63; స్టోనిస్-35; మిచెల్ మార్ష్-28 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్ కార్తీ మూడు; జాషువా లిటిల్ రెండు వికెట్లు పడగొట్టారు.

ఆ తర్వాత ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటింగ్ లైనప్ కకావికలం అయ్యింది.  లోర్కాన్-71 మాత్రమే రాణించాడు. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు.

ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్, గ్లెన్ మాక్స్ వెల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా తలా రెండు; మార్కస్ స్టోనిస్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆసీస్ కెప్టెన్ ఆరోన్ పించ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఇండియాపై సౌతాఫ్రికా విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్