Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్Mitchell Starc: ఆసీస్ దే వన్డే సిరీస్

Mitchell Starc: ఆసీస్ దే వన్డే సిరీస్

ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరుగుతోన్న వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా గెల్చుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా రెండో మ్యాచ్ లో 72 పరుగులతో విజయం సాధించిన ఆసీస్ 2-0తో  మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన నేటి మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో 80 పరుగులతో నాటౌట్ గా నిలిచినా స్టీవెన్ స్మిత్ నేడు కూడా సత్తా చాటి 114 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్ తో 94 పరుగులు చేసి ఆరు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. లాబుస్ చేంజ్-58; మిచెల్ మార్ష్ -50 పరుగులతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 280పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు; క్రిస్ ఓక్స్, డేవిడ్ విల్లె  చెరో రెండు; మోయీన్ అలీ ఒక వికెట్ సాధించారు.

ఇంగ్లాండ్ తొలి ఓవర్లోనే పరుగుల ఖాతా తెరవకముందే స్టార్క్ బౌలింగ్ దెబ్బకు రెండు వికెట్లు (జేసన్ రాయ్, డేవిడ్ విల్లె) కోల్పోయింది. ఫిలిప్ సాల్ట్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో జేమ్స్ విన్స్, శామ్ బిల్లింగ్స్ లు నాలుగో వికెట్ కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరి భాగస్వామ్యాన్ని హాజెల్ వుడ్ విడదీశాడు. జేమ్స్ 60; బిల్లింగ్స్ 71 పరుగులు చేసి ఔటయ్యారు. ఆడమ్ జంపా తన స్పిన్ మాయాజాలంతో వరుస వికెట్లు సాధించాడు. దీనితో ఇంగ్లాండ్ 38.5 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, జంపా చెరో నాలుగు, హాజెల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు.

మిచెల్ స్టార్క్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read: South Africa tour of India, 2022: ఇండియాదే వన్డే సిరీస్

RELATED ARTICLES

Most Popular

న్యూస్