Monday, January 20, 2025
HomeTrending Newsఓటిఎస్ పై ప్రతిపక్షాల కుట్రలు: అవంతి

ఓటిఎస్ పై ప్రతిపక్షాల కుట్రలు: అవంతి

OTS launched:
పేద ప్రజలకు శాశ్వత గృహహక్కు కల్పించడమే సిఎం జగన్ ఉద్దేశమని రాష్ట్ర క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎటువంటి అవినీతి, రాజకీయ దురుద్దేశాలు లేకుండా ప్రజలకు మేలు చేసే పధకం OTS అని,  ప్రజలకు మేలు చేసే కార్యక్రమంపై ప్రతిపక్షాల కుట్రలు చేస్తున్నాయని అవంతి ఆరోపించారు. OTS పై చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దని మంత్రి సూచించారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో OTS లబ్ధిదారుల స్థల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అవంతి ప్రారంభించారు. లబ్ధిదారులకు గృహ హక్కు పత్రాలు అందజేశారు.

ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలే స్వచ్చందంగా ముందుకురావడం సంతోషంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.  తాను అధికారంలోకి వస్తే ఫ్రీగా రిజిస్ట్రేషన్లు చేస్తామంటున్న చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఈ పథకంలో చేరి రుణవిముక్తులు కావాలని కోరుతున్నాం తప్ప ఎలాంటి బలవంతం లేదని మంత్రి తేల్చి చెప్పారు.

Also Read : భద్రాద్రి రామయ్యకు కొడాలి నాని స్వర్ణ కిరీటం

RELATED ARTICLES

Most Popular

న్యూస్