Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Ind Vs. Aus T20: మహేష్ భగవత్ ను కలిసిన అజార్

Ind Vs. Aus T20: మహేష్ భగవత్ ను కలిసిన అజార్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, సెక్రటరీ విజయానంద్ లు నేడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తో సమావేశమయ్యారు.  సెప్టెంబర్ 25న ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య టి 20మ్యాచ్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన అనుమతులు, భద్రతా ఏర్పాట్లపై వారు మహేష్ భగవత్ తో చర్చించారు.   రాష్ట్రపతి సేవా మెడల్ అందుకున్న మహేష్ భగవత్ ను అజార్, విజయానంద్ లు అభినందించారు.

సెప్టెంబర్ 20 నుంచి 25 మధ్య మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇండియాలో పర్యటించనుంది.  సెప్టెంబర్ 20న మొదటి మ్యాచ్ మొహాలీ; రెండో మ్యాచ్ 23న నాగపూర్; మూడవ మ్యాచ్ 25న హైదరాబాద్ లో జరగనున్నాయి.

అక్టోబర్  16 నుంచి నవంబర్ 13 వరకూ ఆస్ట్రేలియా లో జరగనున్న టి 20 పురుషుల వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ లతో స్వదేశంలో టీమిండియా రెండు సిరీస్ లు ఆడబోతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్