Sunday, November 24, 2024
HomeTrending Newsవిచక్షణ కోల్పోయి ఆ మాటలు: పెద్దిరెడ్డి ఆగ్రహం

విచక్షణ కోల్పోయి ఆ మాటలు: పెద్దిరెడ్డి ఆగ్రహం

చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా ఉపయోగం లేదని, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని.. మరోసారి ఆ పార్టీకి ఓటమి తప్పదని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ జిల్లాలో పుట్టాడు కానీ ఈ ప్రాంతంతో బాబుకు ఎలాంటి  సంబంధం లేదని స్పష్టం చేశారు.  పండగ సంబరాలకు వచ్చామని చెప్పి ఇలా రాజకీయాలు, హెచ్చరికలు మాట్లాడడం ఏమిటని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఈ ఉదయం తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలను పెద్దిరెడ్డి తీవ్రంగా ఖండించారు.  ఈసారి కుప్పంలో కూడా తన జెండా పీకేస్తారనే భయం బాబుకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న సీట్ల కంటే ఒక్క సీటు కూడా టిడిపికి అదనంగా వచ్చే అవకాశం లేదని అన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తీ అని, కుట్రలు కుతంత్రాలు.. తిమ్మిని బొమ్మిని చేసే రాజకీయాలు నడిపే వ్యక్తీ అని .. ప్రజా నాయకుడైన జగన్ ముందు అయన ఆటలు సాగాబోవని అన్నారు.  తనను ఏదో చేస్తానని బాబు అంటున్నారని… కానీ గతంలోనే ఆయన వల్ల కాలేదని ఇప్పుడు ఏం చేస్తారని సవాల్ చేశారు.  అప్పట్లో ఎన్నో ప్రయత్నాలు చేశారని, అక్రమంగా కేసులు పెట్టి మిథున్ రెడ్డిని జైల్లో పెట్టిన విషయం గుర్తు లేదా అని బాబును సూటిగా ప్రశ్నించారు.

జిల్లాలో ఏనాడూ టిడిపి మెజార్టీ స్థానాలు గెల్చుకోలేదని, చంద్రబాబుకు ఈ జిల్లాపై అసలు పట్టు లేదని విమర్శించారు. వైసీపీ వచ్చిన తరువాత టిడిపి పరిస్థితి మరింత దిగజారిందని, నామరూపాల్లేకుండా పోయిందని… ఇంకా ఏమైనా ఉంటె 2024 లో తుడిచి వేస్తామని ఛాలెంజ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తించి ఇప్పుడు కారుకూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు.  ‘నేను భారమో- నువ్వు భారమో జిల్లా ప్రజలు చెప్పాలి’ అంటూ బాబుపై ఫైర్ అయ్యారు.  సిఎం జగన్ వచ్చిన తరువాత  ప్రతి ఎన్నికల్లో టిడిపికి ఎదురుదెబ్బ తగిలిందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు.

ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు చిత్తూరు జిల్లాకు, కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. సిఎంగా ఉండగా హంద్రీనీవా ఎందుకు పూర్తి చేయలేకపోయారని, ఇప్పుడు సిఎం జగన్ వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి 2019నుంచే మంచి రోజులు వచ్చాయని, చంద్రబాబుకు అల్జీమర్స్ వచ్చింది కాబట్టి గుర్తు లేకపోవచ్చని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్