Sunday, January 19, 2025
HomeTrending NewsChandrababu-Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు

Chandrababu-Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. దీనిలో పాల్గొనాల్సిందిగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2023  నవంబర్ 30 వరకూ జి 20 కూటమి అధ్యక్షుడిగా భారత్ వ్యవహరించనుంది. ఇటీవల ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగిన జి 20 సదస్సులో భారత ప్రధాని మోడీకి ఆ గ్రూప్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంగతి విదితమే.

వచ్చే ఏడాది జి 20 సమావేశాలు ఇండియాలో జరగనున్నాయి. ఈ సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షుల అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ భేటీ న్రివహిస్తోంది. డిసెంబర్ 5న సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా జరిగిన జాతీయ స్థాయి సమావేశానికి చంద్రబాబు హాజరై, ప్రధాని మోడీతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మళ్ళీ ఈ భేటీకి బాబు హాజరు కానున్నారు.

Also Read : ఒక్క కనుసైగతో…..: బాబు వార్నింగ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్